Thursday, September 26, 2013

సాయి భజన పాట


ఈ గురువారం సాయంసంధ్యలో షిరిడీ సాయి బాబా వారి భక్తులందరికీ వందనములతో....చిన్న  భజన పాట-పల్లవితో (గుర్తున్నంత వరకు...) 


నందనందన యదుకుల భూషణ... రాధా రమణ-శుభ చరణా...
హే మధుసూదన సాయి కృష్ణా... కరుణను గనుమో పావనా...

హే జనార్ధనా!   శ్రీ రమణా... శ్రీ షిరిడి సాయీ నారాయణా 
నందనందన యదుకుల భూషణ... రాధా రమణ-శుభ చరణా...

సాహితీ శశి(సాయి)అంతరంగ స్రవంతి-బాబావారం సాయంసంధ్య - గం.7.20 ని.         

Thursday, August 29, 2013

SAMARDHA SADGURUNAKU STHUTHIPOORVAKA PNCHAARATHULU


షిర్డీ సాయి బాబా వారికి - పంచ (వాక్య) హారతులు 

షిరిడి సాయి - సాక్షాత్ ఆ విష్ణు స్వరూపమేను    
షిరిడి సాయి - నిర్ద్వంద్వంగా మురళీధరుడేను                                                             షిరిడి సాయి - ముమ్మాటికి సమర్ధ సద్గురుడేను 
షిరిడి సాయి - సర్వాన్తర్యామిత్వమునకు సరైన విలాసమేను 
షిరిడి సాయి - జగత్తునకు శ్రద్ధ-సబూరి వరాల వెలుగులు పంచెను
 

Thursday, March 7, 2013

manasamoka SAI mandiram


ee guruvaram SAYAM sandhyabhi vandanamulaku thoduga....kavithaa needaga....sahithi sasi F/B Mitrulatho / Sai Bhakthulandaritho panchukuntunna mrudumadhuramaina naa hridaya bhavanalu.....Sai naadhuniki GURUVARM Kanukaga/Guru Dakshinaga....Thanks for Sharing this....
నా 'మనసు' పరిపరి విధాల....
'సాయి'నే తలచుకుంటూ ఉంటుంది

నా 'మది' వసారా యావత్తు....
'సాయి' చిత్తరువులే పరచుకుని ఉంటాయి

నా 'మానస'మనే సరోవరంలో....
'సాయి'నామం హంసగా విహరిస్తూ ఉంటుంది

నా 'ఎద' గదుల అలమరాలన్నీ....

'సాయి'కృష్ణుని ప్రతిరూపా
తోనిండి ఉంటాయి.

దృశ్యమానమవుతుంది నా ప్రతి శుభోదయంలో
అమ్మఒదికి సమానమైన 'ద్వారకామాయి' ప్రాంగణం

సదా రూపు కట్టి ఉంటుంది నా 'హృదయం'లో
షిరిదీలోని సమాధిమందిర 'సాయినాధుని' ప్రతిమారూపం

------'సాహితీ శశి' అంతరంగ 'సాయి' స్రవంతి------

Like ·  ·  · Promote · 2 minutes ago · 
Ok Saibaba maharaj ki jai....

Wednesday, November 21, 2012

Sahithi Sasi Antharanga Sravanthi


మది  నిండా  షిరిడి సాయి
హృది నిండా సద్గురు సాయి
మానసంలో సింహభాగం సాయి ఆలోచనలే
అంతరంగ స్రవంతి యావత్తు బాబా సాలోచనలే
మనసు  గదుల నిండా సాయి బాబా వారి చిత్తరువులే
హృదయం సడి కూడా సాయి-బాబా సాయి-బాబా
***********సాహితీ శశి అంతరంగం ************

Friday, May 18, 2012

నా మది మందిరంలో మరిన్ని సాయి మధురానుభూతులు 

అన్నీ ఇన్నీ కావు, లెక్కింపలేనన్ని షిరిడి సా-ఈశుని దివ్య స్మృతులు 

కొన్నింటినన్నా అక్షరీకరించాలని తాపత్రయపడిన సంగతులు 

సాయి తత్వామృత బిందువులు....సాయి భక్తులకవి శక్తి సమన్వితములు 

***************సాహితిశశి అంతరంగ జనితములు*********** 


నా మది మందిరంలో మరిన్ని సాయి మధురానుభూతులు 


అన్నీ ఇన్నీ కావు, లెక్కింపలేనన్ని షిరిడి సా-ఈశుని దివ్య స్మృతులు 

కొన్నింటినన్నా అక్షరీకరించాలని తాపత్రయపడిన సంగతులు 

సాయి తత్వామృత బిందువులు....సాయి భక్తులకవి శక్తి సమన్వితములు 

***************సాహితిశశి అంతరంగ జనితములు *****************


 ·  · Yesterday at 4:53pm · 

Wednesday, May 16, 2012


అమ్మ - అమృతం.

   

అమ్మఎప్పటికి బిడ్డ పైన ప్రేమనే కురిపిస్తుంది....ద్వారకామాయి కూడా అంతే కదా ! !

జీవితంలో మార్పును తీవ్రంగా కోరుకునే వారెవరైనా, షిరిడీ బాబా వారిని సద్గురువుగా భావించి....అచ్చం అమ్మలాగా సంభావించి సదా ధ్యానిస్తే , సదా స్మరిస్తే,,,,,మనల మంచి కోసం బాబా తపిస్తాడు....ద్వారకామాయి పరితపిస్తుంది....ఇది నిజం, విలువైన నవవిధ భక్తి  ఫలిత నైజం. 

కన్నతల్లి ఎంతగా ప్రేమించి తరిస్తామో అంతటి స్థాయిలోనే ద్వారకామాయి అమ్మఒడిని నమ్మి చూడండి, అనుక్షణం ద్వారకామాయి కధలను స్మరణలో ఉంచుకోండి. ఫలితం  స్వయంగా చూస్తారు, స్వయానా అనుభవిస్తారు....ఇది ఖచ్చితం, సాయి తత్వమనేది అమృతం. 


సమస్త సన్మంగళాని భవంతు ....స్వస్తి .....సాహితీశశి అంతరంగం